విజయనగరం జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణానికి వేగవంతమైన ప్రణాళికలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో పేదలకు సొంతింటి భాగ్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. స్థలాలు లేనివారు, ఉండీ గృహం లేనివారిని వేర్వేరుగా గుర్తించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 39,559 మందిని గుర్తించగా.. కొత్తగా జిల్లాకు సుమారు 20 వేల వరకూ ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉందని గృహ నిర్మాణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.