స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: బీసీవై పార్టీ నేతలు పిలుపు నిచ్చారు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సర్వసిద్ధం కావాలని భారత చైతన్య యువజన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని నేతలు వంతల రంగారావు, సిందేరి జగ్గారావు, గెమ్మెలి రామారావు తదితరులు ఈ సందర్భంగా స్పష్టంగా తేల్చిచెప్పారు.