రోహిత్ శర్మతో తనకున్న అనుబంధం ప్రత్యేకమైందన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మతో తన బంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రోహిత్ జట్టులోకి వచ్చినప్పటి నుంచే తమ మధ్య మంచి పరిచయం ఉందని ఆయన తెలిపారు. ఇద్దరం కలిసి చాలా కాలం ఆడటంతో ఒకరి ఆలోచనలు మరొకరికి బాగా తెలుసని, ఇది జట్టు ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సహాయపడుతుందని గంభీర్ స్పష్టం చేశారు.