ఆరేగూడెంలో రికార్డు ధర పలికిన గణపతి లడ్డూ

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని ఆరేగూడెంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పిసాటి అవినాష్ రెడ్డి రెండు లక్షల ఎనభై మూడు వేల రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేలంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. లడ్డూ దక్కించుకున్న అవినాష్ రెడ్డిని శివాజీ యూత్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.