మురిమడుగులో జలసిరి ఫారంపాండ్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామపంచాయతీలో జలసిరి పథకం కింద జరుగుతున్న ఫారంపాండ్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కూలీల పనిదినాలు పెంచాలని స్థానిక సర్పంచ్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఏపీవో, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.