తెలంగాణ ఉద్యమంలో మహాత్మా గాంధీ శాంతియుత పోరాటమే స్ఫూర్తి: కేసీఆర్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మహాత్మాగాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట పంథా తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన ఆయన, ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ మార్గం నేటి యువతకు ఎల్లప్పుడూ ఆచరణీయమని పేర్కొన్నారు. పీడితుల సంక్షేమం కోసం శాంతియుత మార్గంలో సాగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.