రూ.134 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రి: నెల్లూరులో వైద్య సేవలకు ముందడుగు

రిపోర్టర్: Alfa News Service స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి రూ.134 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన నిరంతర విజ్ఞప్తుల నేపథ్యంలో ఈఎస్ఐ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ మూడో తేదీ వరకు బిడ్ల దాఖలుకు అవకాశం కల్పించారు. దీని ద్వారా వేలాది మంది స్థానిక కార్మిక కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.