సీతంపేట ఘాట్ రోడ్డుపై కూలిన భారీ వృక్షాన్ని తొలగించిన యంత్రాంగం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: సీతంపేట

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కారెం కాగుమనగూడ ఘాట్ రోడ్డుపై తుఫాను గాలుల ధాటికి భారీ మామిడి చెట్టు కూలి రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పాలకొండ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. పెట్రోల్ రంపం, జేసీబీల సహాయంతో చెట్టును తొలగించి గంటల వ్యవధిలోనే రహదారిని క్లియర్ చేశారు. అధికారుల సమన్వయంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరణ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఊరట చెందారు.