ఐపీఎల్ మీడియా హక్కులపై ఇంకా నిర్ణయం తీసుకోని బీసీసీఐ
రిపోర్టర్: రమేష్
స్థలం: Mumbai
ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్లపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ మీడియా హక్కుల ప్రక్రియ కోసం ఐదుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, బీసీసీఐ మాత్రం ముంబైలో జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం ఏజీఎమ్ సందర్భంగా దీనిపై చర్చిస్తుందని భావిస్తున్నారు. గతంలో మాదిరిగా ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థను నియమించడంపై బోర్డు ఇంకా స్పష్టతనివ్వలేదు.