స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ చికిత్సపై డాక్టర్ గీత కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్స కేవలం కణితిని తొలగించడం మాత్రమే కాదని, రోగి అయిన మహిళ సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అపోలో అథెనా ప్రిన్సిపాల్ లీడ్ డాక్టర్ గీత కడాయప్రత్ స్పష్టం చేశారు. వ్యాధి నిర్ధారణ కంటే ముందే సరైన అవగాహన, కృత్రిమ మేధస్సు సాంకేతికతతో ముందస్తు పరీక్షలు చేయడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆమె తెలిపారు. చికిత్సతో పాటు మానసిక స్థైర్యం, పునరావాసం ఎంతో కీలకమని పేర్కొన్నారు.