కిర్లంపూడిలో ఉక్కుపాదం మోపి పట్టుకున్న రేషన్ బియ్యం
రిపోర్టర్: Srinivasarao Ummidisetti
స్థలం: కిర్లంపూడి
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. ఈ ఘటనలో సుమారు తొంబై ఆరు క్వింటాళ్ల బియ్యంతో పాటు రెండు వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాల విలువ పద్నాలుగు లక్షల అరవై వేలు, బియ్యం విలువ నాలుగు లక్షల ముప్పై వేలుగా అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై సతీశ్ కుమార్ వెల్లడించారు.