నాగర్కర్నూల్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి మహేష్ నియామకం
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట సర్పంచ్ ఇమ్మడి మహేష్ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఓబీసీ సమాజ అభ్యున్నతికి, సంస్థాగత బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఇమ్మడి మహేష్ స్పష్టం చేశారు.