రాష్ట్రంలో ఆరు వందల నలభై ఒక్క ఉద్యోగాల భర్తీకి ప్రకటన
రిపోర్టర్: సురేష్
స్థలం: దిల్లీ
దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఆరు వందల నలభై ఒక్క పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారిక ప్రకటన వెలువడినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్, ప్యూన్ తదితర పోస్టులకు అక్టోబర్ ఆరు నుంచి నవంబర్ నాల్గవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.