పాఠశాలల ఎస్ఏ1 పరీక్షల మూల్యాంకనంపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలోని పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, ఆన్లైన్ మార్కుల నమోదుపై పాఠశాల విద్య డైరెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపిక చేసిన తొమ్మిది జిల్లాల్లో ఆరో తరగతి, అన్ని జిల్లాల్లో తొమ్మిదో తరగతి పేపర్లను ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ పద్ధతిలో పరిశీలించి హెచ్ఎంల పర్యవేక్షణలో మార్కులను వెబ్పోర్టల్లో నమోదు చేయాలని డీఈఓలకు సర్క్యులర్ పంపారు.