ట్యాంకర్ల మరమ్మతులు గాలికొదిలి అద్దెల పేరుతో నిధుల దుర్వినియోగం
రిపోర్టర్: అశోక్
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి పురపాలక సంఘంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సరఫరా నిధులు వృథా అవుతున్నాయి. పైపులైన్లు లేని ప్రాంతాలకు నీరందించే రెండు ట్యాంకర్లు పాడైపోయినా వాటిని బాగు చేయించకుండా, రోజువారీ అద్దె ప్రాతిపదికన ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఒక్కో ట్యాంకరుకు ఇంధనంతో కలిపి రోజుకు రూ.నాలుగు వేల వరకు ఖర్చవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని పుర కమిషనర్ రామలక్ష్మి తెలిపారు. ప్రజాధనం వృథా కాకుండా తక్షణమే రిపేర్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.