స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పష్టత: ప్రజల తీర్పే మన మాండేట్
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
నేటి స్థానిక ఎన్నికల ఫలితాలే తమ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన మాండేట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సుపరిపాలనను మెచ్చి ప్రజలు కూటమికి తీర్పు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. రాజకీయాల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేస్తామని తేల్చిచెప్పారు. చిన్నచిన్న లోపాలను అధిగమించి ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.