రాయలసీమ రవాణాలో చారిత్రక మార్పు: గువ్వలచెరువులో భారీ సొరంగ మార్గం నిర్మించనున్న కేంద్రం

రిపోర్టర్: శివ స్థలం: కడప

రాయలసీమ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కడప, అన్నమయ్య జిల్లాల్లో గువ్వలచెరువు ఘాట్ రహదారిపై ఏడున్నర కిలోమీటర్ల మేర అత్యాధునిక సొరంగ మార్గాన్ని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రతిపాదిత సొరంగ నిర్మాణం పూర్తయితే ప్రయాణ దూరం తగ్గడంతో పాటు రాకపోకలు మరింత సురక్షితంగా మారనున్నాయి.