నర్సీపట్నంలో వైకాపా అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణపై విరుచుకుపడ్డ నేతలు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారని పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.