'అంతర్జాతీయ ప్రమాణాలతో జి-2 చిత్రం': ఫిబ్రవరి 5న థియేటర్లలోకి అడివి శేష్ మూవీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించిన సంచలన విజయం గూఢచారి చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ప్రతిష్టాత్మక జి-2 చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇమ్రాన్ హష్మీ, వామికా గబ్బి మరియు మధు శాలిని కీలక పాత్రలు పోషిస్తుండగా, భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.