మిల్లర్లపై దాడులు ఆపి బకాయిలు చెల్లించాలని డిమాండ్

రిపోర్టర్: G SUDHEER KUMAR స్థలం: బాన్సువాడ

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రైస్ మిల్లర్లపై రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ తనిఖీలను తక్షణమే నిలిపివేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా తనిఖీలు, కేసులు, అరెస్టులతో మిల్లర్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆ సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బాన్సువాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మిల్లర్ల బకాయిల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.