షాకింగ్ ఘటన: విద్యుదాఘాతంతో పది నెలల చిన్నారి దుర్మరణం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Jagtial
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్ లో ఆడుకుంటున్న పది నెలల చిన్నారి విభూది ఆద్య ఛార్జింగ్ లో ఉన్న ఎలక్ట్రానిక్ కాంటాను తాకడంతో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. పాపను కాపాడబోయిన తండ్రి తిరుపతికి కూడా షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నారి మృతి చెందిందని, ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుందని వారు పేర్కొన్నారు.