'భవిష్యత్తు విద్యుత్‌ డిమాండ్‌పై మాస్టర్‌ప్లాన్‌': విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల అధికారుల భేటీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయవాడ

దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో వచ్చే విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. 2036-37 నాటికి అవసరమయ్యే విద్యుత్‌ ప్రణాళిక, సరిపడా వనరుల లభ్యతపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల అధికారులు, సీఈఆర్‌సీ ప్రతినిధులు ఈ భేటీకి హాజరై సమగ్ర కార్యాచరణ నివేదికను రూపొందించనున్నారు.