ఇంటి రంగుల ఎంపికలో మెలకువలు: దశాబ్దాల పాటు భద్రతకు వాటర్‌ప్రూఫ్ ఉత్తమం
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
ఇంటి నిర్మాణంలో గోడలకు వేసే రంగుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు, చెమ్మ, ఎండల బారి నుంచి రక్షణ కోసం నాణ్యమైన వాటర్‌ప్రూఫ్ రంగులను వాడడం వల్ల ఇళ్లు దశాబ్దాల పాటు దెబ్బతినకుండా భద్రంగా ఉంటాయని వారు స్పష్టం చేశారు. రంగుల ఎంపికలో ఏమాత్రం రాజీపడినా భవనాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతుందని వారు హెచ్చరించారు.