రూపాయి నాణేల చందాలతో నామినేషన్: తిరుపతి జిల్లాలో వినూత్న నిరసన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తిరుపతి

గ్రామ సమస్యలు పరిష్కరించని నేతల తీరుపై విసిగిపోయిన తిరుపతి జిల్లా గ్రామీణ మండలం చిగురువాడ ప్రజలు వినూత్న నిరసనకు తెరలేపారు. గ్రామస్థులంతా ఏకమై తలా రూపాయి చొప్పున చందాలు వేసి సుభద్రను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపినట్లు ఆమె స్పష్టం చేశారు. సేకరించిన ఆరు వేల రూపాయి నాణేల సంచులతో ఆమె నామినేషన్ వేయడానికి రావడం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఈ సందర్భంగా సుభద్ర వెల్లడించారు.