హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: కారు బోల్తా పడి డ్రైవర్ మృతి

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా వరికుంటపాడు పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెన డివైడర్ను ఢీకొనడంతో డ్రైవర్ రవికుమార్ అక్కడిక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని, తాడిపత్రి నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని వారు వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.