విజయవాడ ఉత్సవ్: అన్ని వర్గాల వారికి ఏడు కేటగిరీల్లో వినూత్న పోటీలు
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయవాడ
సమాజంలోని అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేసేలా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు జిజ్ఞాస ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికీ అవకాశం కల్పిస్తూ ఏడు కేటగిరీల్లో నూట మూడు రకాల పోటీలను ఐదు రోజుల పాటు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కళలు, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.