బతుకమ్మ కుంట స్థలాన్ని కాపాడాలి: ఆర్డీవో ఎదుట గ్రామస్తుల ధర్నా

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట మున్సిపాలిటీలోని రాజపల్లెలో బతుకమ్మ కుంట భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహిళలు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తాతల కాలం నుంచి బతుకమ్మ ఆడుకుంటున్న స్థలాన్ని కొందరు అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర సర్వే జరిపించి, వివాదానికి తెరదించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.