బ్రిటిష్ మ్యూజియంలో బాయుక్స్ టాపెస్ట్రీ ఫోటోగ్రఫీపై నిషేధం
రిపోర్టర్: రమేష్
స్థలం: లండన్
లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్న చారిత్రక బాయుక్స్ టాపెస్ట్రీ ప్రదర్శనలో సందర్శకులు ఫోటోలు తీయడాన్ని మ్యూజియం అధికారులు నిషేధించారు. సందర్శకులు ఫోటోలు తీయడం వల్ల జనసమ్మర్ధం పెరిగి, క్యూలైన్లకు అంతరాయం కలుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 68 మీటర్ల పొడవున్న ఈ పదకొండవ శతాబ్దపు ఎంబ్రాయిడరీని చూసేందుకు విపరీతమైన స్పందన వస్తుండటంతో సందర్శకుల రాకపోకలను సజావుగా సాగించేందుకు ఈ నిబంధన తెచ్చారు.