పెనుగంచిప్రోలు మునేరు ఇసుకలో నిధుల వేట: బంగారం కోసం కుటుంబాలతో తవ్వకాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పెనుగంచిప్రోలు
పెనుగంచిప్రోలులోని మునేరు ఇసుకలో బంగారం కోసం కొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. చిత్తూరు నుంచి కుటుంబాలతో తరలివచ్చిన కొందరు రోజంతా ఇసుకను జల్లెడ పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇలా దొరికే వాటితోనే జీవనం సాగిస్తున్నట్లు వారు వెల్లడించారు. అయితే భూమిలో లభించే నిధులు ప్రభుత్వానికే చెందుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నప్పటికీ, ఈ తవ్వకాలు నిరంతరం కొనసాగుతుండటం గమనార్హం.