ఉద్యోగులకు ఖరీదైన ఐఫోన్లు బహుమతిగా ఇచ్చిన యూఏఈ కంపెనీ

రిపోర్టర్: సురేష్ స్థలం: దుబాయ్

యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ స్టార్ మ్యాన్పవర్ సంస్థ తమ ఉద్యోగులకు అందరికీ ఖరీదైన ఐఫోన్లను బహుమతిగా అందించి మనసులు గెలుచుకుంది. గిఫ్ట్ బాక్సులలో కొందరికి చాక్లెట్లు, మరికొందరికి ఐఫోన్లు ఉంచి యాజమాన్యం సరదాగా ఉత్కంఠ రేపింది. చివర్లో చాక్లెట్లు పొందిన ప్రతి ఒక్కరికీ ఎండీ హసీనా నిషాద్ స్వయంగా ఐఫోన్లు అందజేశారు. ఏ ఒక్కరినీ నిరాశపరచకుండా అందరికీ బహుమతులు ఇచ్చి తమ ఉదారత చాటుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నిషాద్ హుస్సేన్ తెలిపారు.