గ్రానైట్ వ్యర్థాలు తొలగించాలి.. గిరిజనుల వినూత్న నిరసన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మడుగుల

అనకాపల్లి జిల్లా మడుగుల, రావికమతం మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో క్వారీల వ్యర్థాల వల్ల పంట పొలాలు నాశనమవుతున్నాయి. ఊటగడ్డలో గ్రానైట్ వ్యర్థాలు చేరడంతో రైతులు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.

కొండలపై క్వారీల కార్యకలాపాల వల్ల గిరిజనుల భూములు ఇసుక మేటలతో దెబ్బతిన్నాయి. తక్షణమే అధికారులు స్పందించి, కొత్త క్వారీల పర్యావరణ అనుమతుల సభను రద్దు చేయాలని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.