2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న మెగాస్టార్ కాకా సినిమా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కాకా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ వెల్లడించింది. ఎటువంటి ఊహాగానాలకు తావులేకుండా 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. వెంకట్ నారాయణ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.