పోలవరం నిర్వాసితులకు నాలుగువందల పంతొమ్మిది ఇంటి పట్టాల పంపిణీ

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన కుటుంబాలకు శనివారం రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలను అందజేశారు. వేలేరుపాడు మండలం రేపాక గొమ్ము పంచాయతీ పరిధిలోని రేపాక గొమ్ము, సంతబజారు, వేలేరుపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ, ఎర్రబోరు గ్రామాలకు చెందిన 419 కుటుంబాలకు పునరావాసం నిమిత్తం జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు, రెవిన్యూ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.