రేషన్ బియ్యం రవాణాలో అధికారుల అక్రమ తంతుపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు సివిల్ సప్లై గోడౌన్ వద్ద కాటా వేయకుండానే రేషన్ బియ్యం బస్తాలను లారీలతో డీలర్ షాపులకు తరలిస్తున్నారు. రిజిస్టర్ నమోదు చేయకుండా, ఆర్ఓ షీట్ ద్వారా తూకం వేయకుండా బియ్యం మారుస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తంతుపై అధికారులు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.