మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బాడంగి
విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస గ్రామంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ శెట్టి ఉమాదేవి ఆధ్వర్యంలో గురువారం మెగా మెడికల్ క్యాంపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, బీపీ, షుగర్ మరియు వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారికి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఉచిత మందులను పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంను సందర్శించి చిన్నారులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందితో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలను సద్వినియోగం చేసుకున్నారు.