మణుగూరు ఏరియాలో అంచనాలను మించి బొగ్గు ఉత్పత్తి: జీఎం రామచందర్

రిపోర్టర్: సతీష్ స్థలం: మణుగూరు

నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, సిబ్బంది అందరూ కష్టపడి పనిచేయాలని మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్ స్పష్టం చేశారు. స్థానిక జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ నెలలో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కంటే అధికంగా సాధించినట్లు తెలిపారు. బొగ్గుకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రతిరోజూ నలభై వేల టన్నుల ఉత్పత్తిని సాధించాలని ఉన్నతాధికారులు ఆదేశించారని, సమయం వృథా చేయకుండా అందరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.