ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని విరాగ్ గ్రూప్ మద్దతు
రిపోర్టర్: వెంకట్
స్థలం: New York
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని పోలాండ్, హంగేరీ, స్లొవేకియా, చెక్ రిపబ్లిక్ దేశాలతో కూడిన విరాగ్ గ్రూప్ స్పష్టం చేసింది. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ దేశాల ప్రతినిధులతో తొలిసారిగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సౌత్ నాయకత్వంగా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదుగుతున్న శక్తిగా భారత్‌కు భద్రతా మండలిలో సముచిత స్థానం దక్కాలని ఆ దేశాలు అభిప్రాయపడ్డాయి.