అక్రమ కేసులతో బెదిరించలేరంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పై కేటీఆర్ తీవ్ర నిప్పులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఆదిలాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని, కానీ ప్రస్తుత పాలకులు మోసపూరిత డ్రామాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.