నీటి వృథా కలకలం: పారడైజ్ రెస్టారెంట్‌కు భారీ జరిమానా విధించిన జలమండలి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ప్రముఖ పారడైజ్ రెస్టారెంట్ భవనం బయట తాగునీటిని విపరీతంగా వృథా చేసిన ఘటనపై జలమండలి అధికారులు స్పందించారని, ఈ మేరకు ఆ సంస్థకు రూ. 20 వేల జరిమానా విధించారని అధికారులు తెలిపారు. ప్రతి నీటి చుక్కను కాపాడాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ, ఈ స్థాయిలో నీటిని వృథా చేయడంపై నగరవాసులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.