సిద్దిపేట జిల్లాలో ఎర్రవల్లి భూముల వివాదంపై ఉత్కంఠ

రిపోర్టర్: కృష్ణ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామ భూములను ఎర్రవల్లి సర్వే నెంబర్ 325లో కలిపారంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టగా, రెవెన్యూ అధికారులు మూడో రోజు సర్వే నిర్వహించి రైతులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న ఈ ప్రాంతంలో చెరువులు, కాలువలు పోగా మిగిలిన భూమిపై సబ్ డివిజన్ సర్వే చేపట్టనుండటం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.