'ప్రజాపాలనతో అభివృద్ధి, సంక్షేమం': రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రిపోర్టర్: గోపి
స్థలం: రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.390 కోట్లు మంజూరయ్యాయని, జిల్లాలో మహిళా సంఘాలకు రూ.187 కోట్ల రుణాలు, రైతులకు రూ.370.75 కోట్ల రుణమాఫీ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే తదితరులు పాల్గొన్నారు.