జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు తిరుగుబాటు షాక్: నేషనల్ కాన్ఫరెన్స్ లో తీవ్ర కలకలం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Srinagar
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నాయకత్వంపై సొంత పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ లోనే తీవ్ర అసంతృప్తి చెలరేగిందని, ఇరవై ఐదు మంది శాసనసభ్యులు మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారని ఓ శాసనసభ్యుడు స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, రాజకీయ సలహాదారు నాసిర్ అస్లామ్ వానీని వెంటనే తొలగించాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.