గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వ్యూహం
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆరోపించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని కిందిస్థాయి క్యాడర్ను అప్రమత్తం చేశామని రామచందర్ రావు వెల్లడించారు.