కడ్తాల్లో వైభవంగా ముగిసిన ఆరవ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తాల్

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో నిర్వహించిన ఆరవ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో వేలాది మంది గ్రామీణ పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు మరియు ఉచిత ఆపరేషన్లను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వైద్యం అందక పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు.