పాచిపట్టిన నీళ్లు, పురుగులన్నం.. అధికారులపై ఫుడ్ కమిషన్ ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: తిరుపతి
పలమనేరు బాలుర ఉన్నత పాఠశాలను ఫుడ్ కమిషన్ సభ్యుడు కృష్ణకిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యతలేని భోజనం, పాచిపట్టిన నీటిపై విద్యార్థులు వాపోయారు. హెచ్‌ఎం సిగరెట్ తాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులైన ఎంఈవో, హెచ్‌ఎంలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వంట నిర్వాహకులను మార్చాలని, గుత్తేదారును బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు.