రాజస్థాన్ తిజారా మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Rajasthan

రాజస్థాన్ లోని తిజారా మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ ఎన్నికల్లో హైడ్రామా నడుమ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర ఉత్కంఠ పోరు సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఒక్కో ఓటు మెజారిటీతో గెలుపొందారు. కౌన్సిలర్ల తరలింపు, పోలీసుల జోక్యం, హైకోర్టు జోక్యం వంటి నాటకీయ పరిణామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఈ ఎన్నిక ముగిసింది.