సమస్యల పరిష్కారానికి సహకరించాలని తెదేపా నేతల వినతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బద్వేల్
బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డిని తెల్లపాడు గ్రామపంచాయతీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో పంచాయతీలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించి సహకరించాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక తెదేపా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.