సిద్దిపేటలో నీరులేక అల్లాడుతున్న నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
రిపోర్టర్: రమేష్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి నీటి కష్టాలు మొదలయ్యాయి. రంగనాయకసాగర్ ఎండిపోవడం, గోదావరి జలాలు ఎత్తిపోయకపోవడంతో ఫ్యాక్టరీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. క్రషింగ్‌కు రోజుకు 6 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా, అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వైఫల్యంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.