లక్నోలో హోటల్ యజమాని శివ శర్మ అనుమానాస్పద మృతి: తల్లి సంచలన ఆరోపణలు
రిపోర్టర్: హరి
స్థలం: Lucknow
లక్నోలోని అవధ్ గ్రీన్ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడి శివ శర్మ అనే యువకుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ రజనీష్ వర్మ వెల్లడించారు. ఇదిలా ఉండగా తన కుమారుడిని హత్య చేశారంటూ మృతుడి తల్లి రంజనా శర్మ గర్ల్‌ఫ్రెండ్ శ్రద్ధా దూబేతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.