ఫుడ్ ఎక్స్పెరిమెంట్ వివాదం: బటర్ చికెన్ ఇడ్లీపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

సాంప్రదాయ వంటకాలను వినూత్నంగా మార్చే క్రమంలో ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విష్ కొత్తగా బటర్ చికెన్ స్టఫ్డ్ ఇడ్లీని పరిచయం చేసినట్లు వాన్ష్ అనే వినియోగదారుడు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సరికొత్త ప్రయోగంపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సరికొత్త రుచిని ఆస్వాదించవచ్చని సమర్థిస్తున్నారు. ఈ వినూత్న ఫుడ్ కాంబినేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.